తెలుగు సాంస్కృతి కసమితి ఆధ్వర్యములో తెలుగు బడి బృందం ప్రతి సంవత్సరం "తెలుగు భాష పోటీలు" నిర్వహిస్తుంది. ఈ పోటీలు, తెలుగు చదవటం, వ్రాయటం, ఆంగ్ల పదాలను తెలుగులో కి తర్జుమా చేయటం, పద్యము-తాత్పర్యముతో పాటు చెప్పటం, వక్తృత్వం విభాగాలలో జరుగుతాయి. హూస్టన్మహా నగరములోని తెలుగు బాల బాలిక లందరూ పాల్గొనవచ్చు.
ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడు, ఏ విద్యలో అయినా పిల్లలు బాగా రాణిస్తారు. విదేశములో పెరుగుతూ, ఆంగ్లమే ప్రధాన భాషగా నేర్చుకుంటూ, ఇక్కడ తమ తోటి తెలుగు వారితో పోటీ పడుతూ ఉంటే, ఇంకా బాగా, భాష నేర్చు కోవాలన్న పట్టుదల, తపన పెరుగుతాయి. మన భాష పట్ల ఆశక్తి, గౌరవ భావం ఏర్పడతాయి.
కొంత మంది బాగా మాట్లాడగలరు, కొందరు బాగా వ్రాయగలరు, అందుకే ఎదో ఒక వివిభాగానికే పరిమితం కాకుండా, ఐదు విభాగాలలో ఈ పోటీలు నిర్వహించబడతాయి. తెలుగు బడి ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో ప్రశ్నాపత్రాలు తయారుచేస్తారు.
ఈ పోటీలు నిర్వహించటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా తెలుగు బడి బృందం స్వఛ్ఛందముగా శ్రద్ధగా చేస్తారు. ఔత్సాహికులైన విద్యార్ధులు, తల్లితండ్రుల తోడ్పాటు, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల ప్రోద్బలముతో ప్రతి సంవత్సరమూ ఎంతో విజయ వంతముగా తెలుగు భాష పోటీలు నిర్వహించ బడుతున్నాయి
Register Here