Picnic
విద్యార్థులు పూర్తి స్థాయిలో తాము అభ్యసించిన విద్యలో సఫలీకృతులు అవ్వాలి అంటే, తల్లితండ్రుల ప్రమేయం ఎంతో అవసరం. వారి సహకారం, తమ పిల్లలు నెర్చుకునే విద్య పట్ల అవగాహన, ఉన్నప్పుడే విద్యార్థులు రాణించగలరు. ముఖ్యముగా మాతృ భాష సముపార్జనలో తల్లితండ్రుల పాత్ర మరింత ముఖ్యమైనది. తెలుగు బడి ఉపాధ్యాయులకి, తల్లితండ్రులకి మధ్య సమన్వయం కలగటానికి, పిల్లల చదువు, తదితర విషయాల గురించి చర్చించటానికి "తెలుగు బడి-పిక్నిక్" జరుపుకుంటారు.
ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో కలుసుకుని ఒక కుటుంబములా కలిసి మెలిసి విందు ఆరగించి, సరదాగా కబుర్లతో, ఆటలతో, పిల్లలతో పాటు పెద్దలు కూడా చిన్నప్పటి ఙ్ఞాపకాలలో ఓలలాడుతూ ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ తరహా విందు భోజనాలు, మరీ ముఖ్యముగా, బాలబాలికల భవిష్యత్తు కొరకు చర్చించటానికి, వారే కేంద్రబిందువుగా ఉండే ఇటువంటి సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి.